AP News: కేజీహెచ్‌లో ఆత్మహత్యాయత్నం.. కాపాడిన సిబ్బంది

విశాఖలోని కేజీహెచ్‌ ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ బ్లాక్ పైనుంచి దూకబోయిన ఓ కొవిడ్ బాధితురాలిని వైద్య సిబ్బంది రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించటాన్ని గమనించిన సిబ్బంది ఆమెను కాపాడారు.

Published : 04 Jun 2021 21:40 IST

విశాఖపట్నం: విశాఖలోని కేజీహెచ్‌ ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ బ్లాక్ పైనుంచి దూకబోయిన ఓ కొవిడ్  బాధితురాలిని వైద్య సిబ్బంది రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించటాన్ని గమనించిన సిబ్బంది ఆమెను కాపాడారు. కొద్దిరోజులుగా  కుటుంబానికి దూరంగా ఉండటంతో తనను ఇంటికి పంపించాలని వైద్యులను కోరింది. ఆమె కోలుకోకపోవటంతో వైద్యులు నిరాకరించారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతున్న గది కిటికీ వద్దకు వెళ్లి దూకేందుకు సిద్ధపడింది. 

సమీపంలో ఉన్న మరో కరోనా బాధితుడు గమనించి కేకలు వేయడంతో అప్రమత్తమైన సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఇప్పటికే ఈ బ్లాక్‌లో నలుగురు బాధితులు మేడపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది బయటకు వెల్లడించలేదు. సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని