Ts News: 12 మంది బాలికలపై అత్యాచారం.. దోషులకు శిక్షలు ఖరారు

నల్గొండ జిల్లాలో 2014లో 12 మంది బాలికలపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. దోషులకు శిక్షలు ఖరారు చేసింది. స్వచ్ఛంద సంస్థలో 12 మంది బాలికలపై...

Updated : 06 Jan 2022 23:08 IST

నల్గొండ‌: నల్గొండ జిల్లాలో 2014లో 12 మంది బాలికలపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. దోషులకు శిక్షలు ఖరారు చేసింది. స్వచ్ఛంద సంస్థలో 12 మంది బాలికలపై అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు హరీశ్‌ నాయక్‌ను దోషిగా తేల్చింది. విషయం పోలీసులకు చెప్పకుండా గోప్యంగా ఉంచిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను కూడా నేరస్థులుగా కోర్టు తేల్చింది. అత్యాచారం చేసిన ఇద్దరు, వారికి సహకరించిన నిర్వాహకులకు నల్లగొండ జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఎ-1 రమావత్ హరీష్ నాయక్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 10వేల జరిమానా విధించింది. ఎ-2గా ఉన్న నిర్వాహకులు శ్రీనివాస్ రావుకు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా, ఎ-3గా ఉన్న సరితకు 6నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది.తీర్పు అనంతరం దోషులు పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

ఏం జరిగిందంటే..

నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని ఓ తండాలోని ఆశ్రమ పాఠశాలలో 12 మందిపై బాలికలు చదువుకుంటున్నారు. వీరంతా కూడా 12 ఏళ్లలోపు బాలికలే. వీరిపై మూడు నెలలుగా హరీష్ అనే ట్యూటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ బాలిక ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని