logo

మిశ్రమ వ్యవసాయం.. లాభదాయకం

సాంప్రదాయ పంటల సాగులో అన్నదాతలకు తక్కువ లాభాలు వస్తున్నాయి. దీంతో కొంతమంది యువ రైతులు తక్కువ భూమిలోనే ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు మిశ్రమ వ్యవసాయం చేస్తున్నారు. చేపల పెంపకం, కోళ్ల ఫారమ్‌, కూరగాయల సాగును అధునాతన సాగు పద్ధతులను పాటిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

Published : 31 Mar 2023 05:50 IST

కోళ్ల ఫారమ్‌, చేపల సాగులో రైతన్నలు

నీటి కుంటల్లో చేపలు సాగు చేస్తున్న రైతు

నర్సాపూర్‌(జి),-దిలావర్‌పూర్‌, న్యూస్‌టుడే : సాంప్రదాయ పంటల సాగులో అన్నదాతలకు తక్కువ లాభాలు వస్తున్నాయి. దీంతో కొంతమంది యువ రైతులు తక్కువ భూమిలోనే ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు మిశ్రమ వ్యవసాయం చేస్తున్నారు. చేపల పెంపకం, కోళ్ల ఫారమ్‌, కూరగాయల సాగును అధునాతన సాగు పద్ధతులను పాటిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.
*నర్సాపూర్‌(జి) మండలంలోని రాంపూర్‌ గ్రామానికి చెందిన చిన్నోళ్ల ప్రవీణ్‌ గతంలో వరి సాగు చేసేవాడు. మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం రెండు ఎకరాల్లో చేపల పెంపకం, మొక్కజొన్న, కూరగాయలు సాగు చేస్తున్నాడు. బొచ్చె, బంగారు తీగ, రవాటా వంటి చేపల రకాలతో మత్స్యసంపదతో లాభాలు ఆర్జిస్తున్నాడు. వీటితో పాటు కూరగాయలు సాగు చేస్తూ ఏడాదికి రూ.నాలుగు లక్షల వరకు ఆదాయం వస్తోందని అంటున్నాడు.
* దిలావర్‌పూర్‌లో నిర్మల్‌కు చెందిన రైతు అన్వర్‌ కడక్‌నాథ్‌, దేశీ ఆవులు, చేపల సాగు చేస్తున్నాడు. తెలంగాణలో పలు జిల్లాలకు కడక్‌నాథ్‌ కోళ్లను సరఫరా చేస్తూ ఆదాయం పొందుతున్నాడు. వీటితో పాటే దేశీయ ఆవులు, చేపల సాగుతో ఏడాదికి రూ.6లక్షల వరకు లాభాలు పొందుతున్నానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని