logo

Salaar: ఎడిటింగ్‌లో ఏకలవ్యుడు

సినిమాలపై తనకున్న ఆసక్తి ఆ రంగంలోకి అడుగుపెట్టెలా చేసింది.. ఆ దిశగా వెళ్లేందుకు సొంతంగా ఓ కంప్యూటర్‌ కొనుక్కొని యూట్యూబ్‌ ద్వారా మెలకువలు నేర్చుకొని.. అసిస్టెంట్‌ ఎడిటర్‌గా రాణిస్తున్నాడు కడెంకు చెందిన కుర్రాడు రామగిరి విష్ణు.

Updated : 24 Dec 2023 08:11 IST

ఎడిటింగ్‌ చేస్తూ విష్ణు

కడెం, న్యూస్‌టుడే: సినిమాలపై తనకున్న ఆసక్తి ఆ రంగంలోకి అడుగుపెట్టెలా చేసింది.. ఆ దిశగా వెళ్లేందుకు సొంతంగా ఓ కంప్యూటర్‌ కొనుక్కొని యూట్యూబ్‌ ద్వారా మెలకువలు నేర్చుకొని.. అసిస్టెంట్‌ ఎడిటర్‌గా రాణిస్తున్నాడు కడెంకు (Kadam) చెందిన కుర్రాడు రామగిరి విష్ణు. ఏకంగా ఇటీవల విడుదలైన అగ్రశ్రేణి హీరో ప్రభాస్‌ నటించిన సలార్‌ (Salaar) చిత్రానికి అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశాడు. విష్ణు హైదరాబాద్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు శ్రీనివాస్‌-లత. తండ్రి దర్జీ పనిచేస్తుంటారు. విష్ణు ఇంటర్‌ పూర్తిచేసి డిగ్రీ చదువుతూనే సినిమారంగంపై ఉన్న మక్కువతో ఎలాగైనా అందులో చేరాలని ఎడిటింగ్‌ విభాగంలో మెలకువలను నేర్చుకున్నాడు. యూట్యూబ్‌ ద్వారా ఎప్పటి కప్పుడు తన అనుమానాలు నివృత్తి చేసుకుంటూ చేసిన ఎడిటింగ్‌లను చిత్ర దర్శకులకు పంపించాడు. సలార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఈయనకు అవకాశం ఇవ్వడంతో సినిమాలో పనిచేశాడు. మొదటిసారే అగ్రహీరో సినిమాకు అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేసి రాణించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కల్యాణ్‌ దర్శకత్వంలో విడుదలైన మ్యాడ్‌ సినిమాకు సైతం ఈయన పనిచేశాడు. ప్రస్తుతం గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి, లక్కీ భాస్కర్‌ చిత్రాలకు సైతం అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన విష్ణు సొంతంగా నేర్చుకుని ఈ రంగంలోకి వెళ్లడంతో మిత్రులు, కడెం వాసులు అభినందిస్తున్నారు. మున్ముందు మరిన్ని మంచి సినిమాల్లో పనిచేసే అవకాశం రావాలని ఆకాంక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని