logo

తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మహారాష్ట్ర నుంచి రైల్లో దేశీదారు సరఫరా కాకుండా ఉండడానికి తలమడుగు మండలం కోసాయి, ఉమడం రైల్వే స్టేషన్లలో శుక్రవారం విస్తృతంగా తనిఖీ చేపట్టారు.

Published : 29 Mar 2024 19:38 IST

ఎదులాపురం: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మహారాష్ట్ర నుంచి రైల్లో దేశీదారు సరఫరా కాకుండా ఉండడానికి తలమడుగు మండలం కోసాయి, ఉమడం రైల్వే స్టేషన్లలో శుక్రవారం విస్తృతంగా తనిఖీ చేపట్టారు. అదేవిధంగా జైనథ్ మండలం తరోడ(భీ) వద్ద రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి.ఎల్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ మద్యం జిల్లాలోకి సరఫరా కాకుండా, అక్రమంగా నగదు చేరవేయకుండా పగడ్బందీ ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని రహదారుల్లోనూ ప్రత్యేక పోలీసు బలగాలతో 24 గంటలు తనిఖీలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు