logo

క్రీడా శిక్షణ శిబిరాల దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా యువజన, క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వాహణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.

Published : 15 Apr 2024 19:05 IST

ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా యువజన, క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వాహణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మే 1 నుంచి మే 31వ తేదీ వరకు శిక్షణ ఉంటుదన్నారు. నిర్వాహకులకు గౌరవ వేతనం, ఉచితంగా క్రీడా సామాగ్రి అందిస్తామని పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు క్రీడాంశం, ప్రదేశం, గ్రామం, ఫోన్ నంబర్‌ వివరాలను ఈనెల 22వ తేదీలోపు 'ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణం, జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయం' చిరునామాకు పంపించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని