భాజపా జిల్లా కార్యవర్గం ఎన్నిక
భాజపా కృష్ణా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజబాబు ప్రకటించారు.
గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: భాజపా కృష్ణా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజబాబు ప్రకటించారు. గుడివాడలోని భాజపా కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా దివి చిన్మయ, నడకుదుటి గాయత్రి, తోట రంగనాథ్, తిరుమలశెట్టి శంకర్, వలపర్ల వెంకటేశ్వరరావు, వల్లభుని భిక్షం, పాలెపోగు లక్ష్మి, అట్లూరి దిలీప్ కుమార్, ప్రధాన కార్యదర్శులుగా అంగడాల సతీష్, తుంగల మురళీ కృష్ణ, సుదర్శనం శేషుకుమార్, పుప్పాల రామాంజనేయులు, కార్యదర్శులుగా దొండపాటి శ్రీనివాసరావు, గాజుల సిద్ధార్థ, బండ్ల గంగాధర్, పామర్తి పవన్, దింటకుర్తి పద్మజ, కోశాధికారిగా వైవీఆర్ పాండురంగారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా ఎన్.అయోధ్యరామ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా దోనేపూడి శివరామయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శలంకాయల లీలాకుమారి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా సీహెచ్.రాజశేఖర్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా పేరం శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పోలన అశోక్ ఎన్నికయ్యారని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు