logo

ఒక్క ఎస్సీకైనా అవకాశమిచ్చారా జగన్‌?

ముఖ్యమంత్రి జగన్‌ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు.

Published : 24 Apr 2024 05:24 IST

బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని

బంటుమిల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మండల కేంద్రమైన బంటుమిల్లిలో పర్యటించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పేరుకే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పుకొంటారని, వారికి ఆయన చేసిందేమీ లేదని అన్నారు.మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కావాలనే జగన్‌ హత్యకేసులో ఇరికించాలని ప్రయత్నించారని, ఈ విషయమై నేను ఆనాడు జిల్లా ఎస్పీని ప్రశ్నిస్తే ఆ విషయం తెలుసుకొని జగన్‌ తనను మందలించారని అన్నారు. బందరు పోర్టుతో మచిలీపట్నం, పెడన నియోజకవర్గాలు పారిశ్రామిక హబ్‌గా మారతాయని, అనుబంధ సంస్థలకు కావాల్సిన భూములు పెడనలో ఉన్నాయని ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తనకు గ్లాసు గుర్తుపై, పెడన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కాగిత కృష్ణప్రసాద్‌కు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. బూరగడ్డ వేదవ్యాస్‌, పంచకర్ల సురేష్‌, ర్యాలీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

జనసేనలోకి భారీగా చేరికలు

బంటుమిల్లి సర్పంచి వెంట్రప్రగడ కృష్ణవేణి, ఆయన భర్త న్యాయవాది సుజ్ఞానం సతీష్‌లు, మరో  100 మందితో వైకాపాను వీడి మంగళవారం ఎంపీ బాలశౌరి సమక్ష్యంలో జనసేనలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని