logo

పెట్రో ధరలు తగ్గించండి

పెట్రో ధరలు తగ్గించాలని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు డిమాండ్‌ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయం నుంచి టీ సర్కిల్‌లోని పెట్రోల్‌బంక్‌ వరకు నాయకులు ద్విచక్రవాహనాలను తోసుకుంటూ వినూత్న నిరసన తెలిపారు. బంక్‌ వద్ద బైఠాయించి

Published : 26 May 2022 03:53 IST


ద్విచక్రవాహనాన్ని తోసుకుంటూ వస్తున్న ఉమామహేశ్వరనాయుడు, నాయకులు

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: పెట్రో ధరలు తగ్గించాలని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు డిమాండ్‌ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయం నుంచి టీ సర్కిల్‌లోని పెట్రోల్‌బంక్‌ వరకు నాయకులు ద్విచక్రవాహనాలను తోసుకుంటూ వినూత్న నిరసన తెలిపారు. బంక్‌ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ కేంద్రం ధరలు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. సామాన్యుడిపై భారం మోపడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. నిత్యావసర సరుకుల రేట్లూ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని