logo

కస్తూర్బా విద్యార్థినులను పరామర్శించిన మంత్రి

శింగనమల మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో  అస్వస్థతకు గురైన విద్యార్థినులను మంత్రి ఉష శుక్రవారం అర్ధరాత్రి పరామర్శించారు.

Published : 04 Dec 2022 04:35 IST

బాధితురాలిని పరామర్శిస్తున్న మంత్రి ఉష

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: శింగనమల మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో  అస్వస్థతకు గురైన విద్యార్థినులను మంత్రి ఉష శుక్రవారం అర్ధరాత్రి పరామర్శించారు. విషయం తెలుసుకున్న ఆమె అనంతపురం ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థినులను, తల్లిదండ్రులను పరామర్శించారు.

తనిఖీ చేసిన కలెక్టర్‌

శింగనమల: శింగనమల కేజీబీవీని శనివారం కలెక్టర్‌ నాగలక్ష్మి తనిఖీ చేశారు. ఈ నెల 2న వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య స్థితిని తెలుసుకొన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందని వంట వారిని ప్రశ్నించారు. పాఠశాల ప్రత్యేక అధికారి శ్రీలక్ష్మీకి వివిధ ప్రశ్నలు వేసి విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలు తెలుసుకొన్నారు. పాఠశాలలోని సరకులు, పాలను సేకరించి పరిశీలనకు పంపాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆర్జేడీ వెంకటకృష్ణ, సమగ్రశిక్ష అధికారి విద్యాసాగర్‌, జిల్లా వైద్యాధికారి యుగంధర్‌, ఆర్డీవో మధుసూదన్‌, మండల అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థినులు ఇంటికి... : పదోతరగతి చదువుతున్న విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులతో పాటు ఇతరులు కూడా వెళ్లారు. ప్రస్తుతం ఇంటర్‌ విద్యార్థినులు మాత్రమే ఉన్నారు.
నాయకులను అడ్డుకున్న పోలీసులు: జనసేన, భాజపా, విద్యార్థి, దళిత సంఘాల నాయకులు శనివారం శింగనమల కస్తూర్బా పరిశీలనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. జనసేన నాయకులు పురుషోత్తంరెడ్డి, సాకే మురళీకృష్ణ తదితరులు రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని