logo

విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి: కలెక్టర్‌

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు తగ్గట్లుగా  ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు.

Published : 08 Feb 2023 03:55 IST

ట్యాబ్‌ వినియోగంపై విద్యార్థినిని ప్రశ్నిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు తగ్గట్లుగా  ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు. మండలంలోని బేలుపల్లె, కడపనత్తం, బైరెడ్డిపల్లె గ్రామాల్లో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. బేలుపల్లె అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లల బరువు, ఎత్తు పరిశీలించారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందజేసిన ట్యాబ్‌ల వినియోగం, బైజూస్‌ కంటెంట్‌ ఉపయోగం, వన్యప్రాణులతో మానవాళికి ప్రయోజనాలు, అంతరించిపోతే అనర్థాల గురించి విద్యార్థులను ప్రశ్నించారు. గణితశాస్త్రంలో విద్యార్థుల ప్రమాణాలను పరిశీలించారు. కడపనత్తం సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ కుమారస్వామి, ఎంపీడీవో రాజేంద్రబాలాజీ పాల్గొన్నారు.

పలమనేరు: మండలంలోని మొరం గ్రామంలోని వెంకటేశ్వర హేచరీస్‌ను కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు. నెలకు రూ.34 లక్షల బ్రాయిలర్‌ పిల్లలు ఉత్పత్తి చేసి జిల్లాలోని రైతులకు ఫార్మర్స్‌ ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌లో సరఫరా చేస్తున్నామన్నారు. వాటి పెంపకం అనంతరం తిరిగి తీసుకుంటున్నట్లు వివరించారు. పశుసంవర్ధకశాఖ జేడీ వెంకట్రావు, ఏడీలు ఆసిఫ్‌, చంద్రశేఖర్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని