logo

18న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 18న విడుదల కానుంది. 18 నుంచి 25వ తేదీ వరకు (ప్రభుత్వ పనిదినాల్లో మాత్రమే) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 26న వాటిని పరిశీలిస్తారు.

Published : 17 Apr 2024 03:04 IST

25 వరకు నామపత్రాల స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 18న విడుదల కానుంది. 18 నుంచి 25వ తేదీ వరకు (ప్రభుత్వ పనిదినాల్లో మాత్రమే) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 26న వాటిని పరిశీలిస్తారు. ఉపసంహరణకు చివరి తేదీ 29. మే 13న పోలింగ్‌. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు. జూన్‌ 6 నాటికి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. జిల్లాలో ఒక ఎంపీ, 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్‌ నియోజకవర్గానికి రిటర్నింగ్‌ అధికారిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ వ్యవహరించనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గ స్థానాలకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరుకు వై.మధుసూదనరెడ్డి (ఎస్‌డీసీ కేఆర్‌ఆర్‌సీ), నగరికి  కె.వెంకటరెడ్డి (నగరి ఆర్డీవో), జీడీనెల్లూరుకు సి.వెంకటశివ (ఎస్‌డీసీ ఐవోసీఎల్‌), చిత్తూరుకు పి.శ్రీనివాసులు (జేసీ), పూతలపట్టుకు జి.చిన్నయ్య (చిత్తూరు ఆర్డీవో), పలమనేరుకు మనోజ్‌రెడ్డి (పలమనేరు ఆర్డీవో), కుప్పానికి జి.శ్రీనివాసులు (కుప్పం ఆర్డీవో)లను నియమించారు.

ఎన్నికల పరిశీలకుల నియామకం

జిల్లాలోని ఒక పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు  కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకుల్ని నియమించింది. వీరు బుధవారం నుంచి జిల్లాలో పర్యటిస్తారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ మంగళవారం తెలిపారు.


వివరాలివీ..  

  • చిత్తూరు పార్లమెంట్‌కు శంకర్‌ప్రసాద్‌ శర్మ (వ్యయ పరిశీలకులు)
  • నగరి, జీడీనెల్లూరు  నియోజకవర్గాలకు కైలాశ్‌ వాంఖడే (సాధారణ పరిశీలకులు)
  • చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలకు సాధిక్‌అలం (సాధారణ పరిశీలకులు)
  • పుంగనూరు, నగరి నియోజకవర్గాలకు శ్రీనివాస్‌ ఖన్నా (వ్యయ పరిశీలకులు)
  • చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు రోహన్‌ ఠాకూర్‌ (వ్యయ పరిశీలకులు)
  • నగరి, జీడీనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు అరవింద్‌.హెచ్‌.సాల్వే (శాంతిభద్రతల పరిశీలకులు).
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని