logo

వసతిగృహ విద్యార్థులతో పనులు?

బీసీ గురుకుల పాఠశాల, వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి కాలు పోగొట్టుకునే ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుపతి గ్రామీణ మండలంలోని తాటితోపు వద్ద మహాత్మా జ్యోతిరావ్‌ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.

Published : 18 Apr 2024 02:26 IST

ఆటో తోస్తుండగా కాలుపైకి దూసుకెళ్లిన వాహనం

బాధితుడు రామ్‌చరణ్‌

తిరుపతి (గ్రామీణ), న్యూస్‌టుడే: బీసీ గురుకుల పాఠశాల, వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి కాలు పోగొట్టుకునే ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుపతి గ్రామీణ మండలంలోని తాటితోపు వద్ద మహాత్మా జ్యోతిరావ్‌ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 5వ తరగతి నుంచి పదోతరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడే వసతి గృహం ఉంది. 184 మంది విద్యార్థులున్నారు. బుధవారం కూరగాయాలతో వచ్చిన ఆటో స్టార్ట్‌ కాకపోవడంతో విద్యార్థులను సాయం కోరారు. ఈక్రమంలో 8వ తరగతి చదువుతున్న రామ్‌చరణ్‌ కాలు మీద ఆటో దూసుకెళ్లింది. వసతిగృహం నర్సు విద్యార్థి తండ్రి చంద్రశేఖర్‌కు సమాచారం ఇచ్చి ప్రథమచికిత్స అనంతరం ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కాలు ఎముక వరకు కండ చీరుకుపోవడంతో విద్యార్థికి శస్త్రచికిత్స చేశారు. విద్యార్థి తండ్రి మాట్లాడుతూ ప్రిన్సిపల్‌ దేవిసులోచన విద్యార్థులతో పనులు చేయిస్తోందని విమర్శించారు. విద్యార్థికి గాయం అయినా మధ్యాహ్నం వరకు ఆమెకు విషయం తెలియదని, తర్వాత తాఫీగా వచ్చి వెళ్లిపోయారన్నారు. శస్త్రచికిత్సకు రూ.45వేలు ఖర్చయిందని, ప్రిన్సిపల్‌ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వాపోయారు. ఘటనపై ముత్యాలరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని