కదలని బదిలీ దస్త్రం..!
రెవెన్యూ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఇంకా కొలిక్కి రావడం లేదు. వివిధ విభాగాల సిబ్బంది బదిలీలకు సంబంధించిన దస్త్రం కదలడం లేదు.
కాకినాడ కలెక్టరేట్: రెవెన్యూ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఇంకా కొలిక్కి రావడం లేదు. వివిధ విభాగాల సిబ్బంది బదిలీలకు సంబంధించిన దస్త్రం కదలడం లేదు. బుధవారంతో ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసినా.. ఇప్పటికీ అధికారులు ఈ ప్రక్రియను చేపట్టలేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాతిపదికన రెవెన్యూ శాఖలో బదిలీలకు చర్యలు చేపట్టారు. అయిదేళ్లు ఒకే చోట సర్వీసు పూర్తిచేసుకున్న వారిని విధిగా బదిలీ చేయాలని, రెండేళ్లు పూర్తయినవారికి వినతి ప్రాతిపదికన స్థానచలనం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. దీని ప్రకారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో బదిలీల పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు బుధవారం అర్ధరాత్రిలోగా స్థానచలనం కల్పించే ప్రక్రియ పూర్తి చేయాలి. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో దస్త్రాన్ని ఇప్పటికే తయారుచేశారు. మిగతా మూడు జిల్లాలకు సంబంధించిన దస్త్రాలు ఇంకా కాకినాడ కలెక్టరేట్‌కు చేరలేదు. ఈ జిల్లాల్లో ఎంత మంది బదిలీల పరిధిలోకి వస్తున్నారు.. ఎంతమంది వినతి కోరుతూ దరఖాస్తు చేశారు.. ఇలా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఇవేవీ ఇంకా రాకపోవడంతో కాకినాడలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన బదిలీ ప్రక్రియ కొలిక్కి రాలేదు.
పూర్తిస్థాయిలో సమాచారం అందక: కాకినాడ జిల్లాలో 28 మంది తహసీల్దార్లు, 70 మంది ఉప తహసీల్దార్లు, 50 మంది సీనియర్ అసిస్టెంట్లు, 40 మంది జూనియర్ అసిస్టెంట్లు, 630 మంది వీర్వోలు ఉన్నారు. ఇప్పటికి 30 మంది వీఆర్వోలు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు బదిలీలకు దరఖాస్తు చేశారు. బుధవారం మధ్యాహ్నం కూడా కొందరు ఉద్యోగులు కలెక్టరేట్‌లో అధికారులకు దరఖాస్తులు అందించారు. డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధించి ఎలాంటి సమాచారం కాకినాడ కలెక్టరేట్‌కు చేరలేదు. గతేడాది జిల్లాల విభజన, ఉద్యోగుల కేటాయింపులు, గత జూన్, జులై నెలల్లోనే ఉద్యోగుల బదిలీలు చేపట్టడంతో అపుడే చాలామందికి స్థానచలనం కలిగింది. దీంతో ఈ ఏడాది బదిలీలు తక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు తహసీల్దార్లు ఎవరూ బదిలీల పరిధిలోకి రాలేదు. రెవెన్యూ శాఖలో బదిలీలపై కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి (ఇన్‌ఛార్జి) కె.శ్రీరమణిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా ఈ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదని వివరణ ఇచ్చారు. బదిలీలకు దరఖాస్తు చేసుకునే గడువు పెంచే అవకాశం ఉందని చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే మిగతా జిల్లాల నుంచి జాబితాలు ఇంకా రాలేదని చెప్పారు. అవి రాగానే బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్