logo

Rajamahendravaram: అదనపు బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు

అదనపు బస్సులు లేకపోవడంతో సంక్రాంతి సెలవుల తర్వాత నగరాలకు బయల్దేరిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

Published : 21 Jan 2024 13:02 IST

వీఎల్‌ పురం (రాజమహేంద్రవరం): అదనపు బస్సులు లేకపోవడంతో సంక్రాంతి సెలవుల తర్వాత నగరాలకు బయల్దేరిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు అధికంగా ఉన్నా అదనపు ఏర్పాట్లు చేయలేదు. గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో ఆర్టీసీ తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు. చిన్నారులతో బస్టాండ్‌కు చేరుకున్నవారు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే విజయవాడ వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి కేవలం రెండు బస్సులనే ఏర్పాటు చేశారు. మరో నాలుగు సిద్ధం చేయాల్సినప్పటికీ బస్సులు లేవంటూ ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని