logo

మరణించినట్లు రికార్డులు సృష్టించి.. రూ.60 కోట్ల విలువైన భూమి స్వాహా

బతికున్న వ్యక్తిని రికార్డుల ప్రకారం చంపేశారు. దొంగ పత్రాలు సృష్టించి రూ.60 కోట్ల భూమిని కాజేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 17 Mar 2024 08:47 IST

మాట్లాడుతున్న ఏసీపీ రమణ గౌడ్‌. చిత్రంలో పోలీసు అధికారులు, నిందితులు(నిల్చున్నవారు)

చేవెళ్ల గ్రామీణం: బతికున్న వ్యక్తిని రికార్డుల ప్రకారం చంపేశారు. దొంగ పత్రాలు సృష్టించి రూ.60 కోట్ల భూమిని కాజేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణరావు తన స్నేహితులతో కలిసి 2005లో శంకర్‌పల్లి పరిధిలో సర్వే నంబర్లు 334, 335లలో 5-12 ఎకరాలు కొన్నాడు. కాకినాడ, విజయవాడ, మచిలీపట్నానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమిని కాజేయాలని కుట్ర పన్నారు. సత్యనారాయణరావు 2014లో మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించారు. అతని వారసుడుగా ముదాగుల వరప్రసాద్‌ పేరిట నకిలీ ఆధార్‌ కార్డు సృష్టించారు. ఆ భూమిని నలుగురు వ్యక్తులు తమ పేరున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సత్యనారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కాకినాడ, విజయవాడ, మచిలీపట్నానికి వెళ్లి దేవగానుగుల రామవీర వెంకట వరప్రసాద్‌, పరశురాం పార్థసారథి, పోతునూరి త్రినాథ్‌, పరశురాం విజయభార్గవ్‌ గురించి విచారించగా మోసం బయటపడింది. వారిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొందరి పాత్ర ఉందని, వారు పరారీలో ఉన్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని