logo

అన్నవరంలో నూతన ధ్వజస్తంభ పనులకు శ్రీకారం

అన్నవరం దేవస్థానంలో అనివేటి మండపంలో బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి గురువారం శ్రీకారం చుట్టారు.

Published : 28 Mar 2024 17:58 IST

అన్నవరం: అన్నవరం దేవస్థానంలో అనివేటి మండపంలో బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి గురువారం శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జీర్ణావస్థలో ఉన్న ధ్వజస్తంభాన్ని కళాపకర్షణకు గానూ తెల్లవారుజాము నుంచి వైదికబృదం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, మండపారాధన, హోమం నిర్వహించారు. అనంతరం గోమాతతో ధ్వజస్తంభం కదిపించారు. ఛైర్మన్‌ ఐ.వి. రోహిత్, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న ధ్వజస్తంభం తొలగింపు పనులు ప్రారంభించారు. కలశలను ఉపసంహరించి భధ్రపర్చనున్నారు. ఈ పనులు ఏప్రిల్‌ మొదటి వారానికి పూర్తవ్వనున్నాయి. ఏప్రిల్‌ 22న ఉదయం 10.45 గంటలకు నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట చేయనున్నారు. ప్రతిష్ట సందర్భంగా ఏప్రిల్‌ 18 నుంచి 5రోజుల పాటు హోమాలు, ప్రత్యేక పూజలు చేపడతారు. నెల్లూరుకు చెందిన ఓ దాత సుమారు రూ. 3 కోట్లు వ్యయంతో సుమారు 2 కేజీల పైబడి బంగారంతో ధ్వజస్తంభాన్ని తీర్చిదిద్దుతున్నారు. అన్నవరం సత్యదేవుని ఆలయ పునర్నిర్మాణం పూరై శిఖర ప్రతిష్ట జరిగి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఏప్రిల్‌ 1న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నివేదిక సమర్పించనున్నారు. భక్తులకు బూరి, పులిహోర, రవ్వకేశరి, గోదుమ నూక ప్రసాదం, కదంబం ప్రసాదం అందిస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని