logo

ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషించాలి

రోగికి మందులు అందజేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సమస్య పరిష్కారమయ్యే వరకూ ప్రతి దశలోనూ ఫార్మసిస్టు కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫార్మసీ కౌన్సెల్‌ రిజిస్ట్రార్‌ రామమూర్తి సూచించారు.

Published : 30 Nov 2022 04:40 IST

రామమూర్తికి జ్ఞాపిక బహూకరిస్తున్న  రంగరాజు, సీతారామయ్య, రవికుమార్‌

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: రోగికి మందులు అందజేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సమస్య పరిష్కారమయ్యే వరకూ ప్రతి దశలోనూ ఫార్మసిస్టు కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫార్మసీ కౌన్సెల్‌ రిజిస్ట్రార్‌ రామమూర్తి సూచించారు. జాతీయ ఫార్మసీ వారోత్సవాల ముగింపు సందర్భంగా హిందూ ఫార్మసీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన సదస్సులో రామమూర్తి మాట్లాడారు. పరిశోధనలు చేసి ఔషధాలను కనిపెట్టేవారు, వాటిని తయారు చేసేవారు, ప్రజలకు చేరవేసేవారు, వాటి గుణాలను రోగికి వివరించి, సలహాలు సూచనలు అందించే మెరుగైన వనరులుగా ఫార్మసిస్టులను తీర్చిదిద్దుకోవాల్సి ఉందన్నారు. ఫార్మసీ కళాశాలలో ఔషధ సమాచార కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఔషధ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. ఉత్తరాంధ్రలో ఔషధ తయారీ కంపెనీలు రానున్నాయని తెలిపారు. దీనివల్ల ఫార్మసీ విధ్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. కళాశాల యాజమాన్యం తరఫున రామమూర్తిని సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్‌ జూపూడి రంగరాజు, కార్యదర్శి మధుసూదనరావు, ఫార్మా-డి సంచాలకులు సీతారామయ్య, ఉప ప్రిన్సిపల్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని