logo

ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు

సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్‌ కార్మిక శాఖ ఇన్‌ఛార్జి సంయుక్త కమిషనర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు

Published : 20 Apr 2024 04:55 IST

గుంటూరు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్‌ కార్మిక శాఖ ఇన్‌ఛార్జి సంయుక్త కమిషనర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడో జోన్‌ పరిధిలోని దుకాణాలు, సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మిక శాఖ కమిషనరు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. మే 13న దుకాణాలు, సంస్థలకు కూడా సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామిక సంస్థలు, ఇతర సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న ప్రతి వ్యక్తి శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్‌ రోజు సెలవు మంజూరు చేయాలన్నారు. వేతనాల్లో ఎలాంటి తగ్గింపు చేయకూడదన్నారు. ఏదైనా సంస్థ యజమాని సబ్‌ సెక్షన్‌ (1) నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు యజమాని జరిమానాతో శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు