logo

రోడ్డుపై రోడ్డు

ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్‌ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు.

Published : 24 Apr 2024 06:56 IST

ప్రజాధనం దుర్వినియోగానికి పరాకాష్ఠ
 అధికార పార్టీ నాయకుడి ఒత్తిడితో పనులు
ఎన్నికల వేళ సందట్లో సడేమియా..!

సీసీ రోడ్డుపై తోలిన కంకర

 నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే : ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్‌ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. చక్కగా ఉన్న రహదారిపై మరో రోడ్డు ఏమిటని స్థానికులు విస్తుపోతున్నారు. గుంతలమయమైన రహదార్లను బాగుచేయడం చేతగాని పాలకులు, అధికారులు బాగున్న సీసీ రోడ్డుపై కొత్త నిర్మాణం చేపట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులంతా ఎన్నికల ప్రక్రియలో ఉండడంతో కింది స్థాయిలో ఇంజినీరింగ్‌ అధికారులు ఇదే అదనుగా కమీషన్లు దండుకునేందుకు పనులు చకచకా చేయించేస్తున్నారు.

సైడు కాల్వల నిర్మాణంలో లోపాలు.. ఈ రహదారిలో సైడుకాల్వలు గతంలో సీసీరోడ్డు కంటే ఎత్తుగా నిర్మించారు. ఇక్కడ 200 మీటర్ల మేర కాల్వలు, రహదారి నిర్మాణానికి సుమారు రూ.18 లక్షలు వ్యయం చేసేలా అనుమతి తీసుకుని పనులు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులు పలుమార్లు ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షించి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ సైడు కాల్వల నిర్మాణం ఒక్కటే జరిగాల్సి ఉన్నా..అధికార పార్టీకి చెందిన వ్యక్తి సీసీ రహదారిపై మరో లేయర్‌ వేసేలా పైనుంచి అధికారులపై ఒత్తిడి చేయించారని సమాచారం.

గోతుల రహదార్లను పట్టించుకోరుగానీ..

- కమలాకర్‌, స్థానికుడు  

చుట్టుపక్కల అనేక రహదారులు గోతులమయంగా ఉన్నా పట్టించుకోని అధికారులు, అధికారపార్టీకి చెందిన వ్యక్తి చెప్పడంతో ఆఘమేఘాలపై పనులు చేయడం ఏమిటి? ఉన్న సీసీ రోడ్డుపైనే మరోమారు రోడ్డు వేయడం ఏమిటి? దీనికి అధికారులే బాధ్యత వహించాలి. ప్రజాధనం దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని