logo

TS News: 18 ఏళ్లు దాటిన వారికి నేటి నుంచి టీకా

పద్దెనిమిది ఏళ్లు పైబడిన పౌరులందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు నేటి నుంచే మహానగరంలో సేవల్ని మొదలుపెట్టాలని......

Updated : 01 Jul 2021 07:11 IST

 

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పద్దెనిమిది ఏళ్లు పైబడిన పౌరులందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు నేటి నుంచే మహానగరంలో సేవల్ని మొదలుపెట్టాలని గ్రేటర్‌ యంత్రాంగాన్ని ఆదేశించింది. బల్దియా ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ 35 ఏళ్లు దాటిన వారికి మాత్రమే నగరంలో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్‌ కేంద్రాల ద్వారా టీకాలు వేస్తున్నారు. అధిక ప్రమాదమున్న వారు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం నుంచి అందరికీ టీకాలు వేసేందుకు మొత్తం 100 కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. టీకా తీసుకునే వారు తప్పనిసరిగా వివరాలను ‘కొవిన్‌’ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని.. నమోదు చేసుకున్న వారికి మాత్రమే వేస్తారని స్పష్టం చేసింది. పేర్లు నమోదు చేసుకొని సమీప ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని