logo

Hyderabad News: గ్రేటర్‌లో 49 అంతస్తుల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీకి అర్జీ

గ్రేటర్‌లో మరో భారీ ఆకాశ హర్మ్యం రాబోతోంది. శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలో 3.5 ఎకరాలకు పైగా స్థలంలో 49 అంతస్తుల్లో భారీ భవనాన్ని నిర్మించేందుకు ఓ సంస్థ జీహెచ్‌ఎంసీకి

Updated : 23 Dec 2021 10:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో మరో భారీ ఆకాశ హర్మ్యం రాబోతోంది. శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలో 3.5 ఎకరాలకు పైగా స్థలంలో 49 అంతస్తుల్లో భారీ భవనాన్ని నిర్మించేందుకు ఓ సంస్థ జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసింది. బల్దియా కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ప్రస్తుతానికి నానక్‌రామ్‌గూడలో చేపడుతున్న 44 అంతస్తుల భవనమే ఎత్తయినది. మదీనాగూడలో 4 సెల్లార్లు, ఒక స్టిల్ట్‌, 49 అంతస్తుల్లో నివాస గృహాలు నిర్మించనున్నట్లు జీహెచ్‌ఎంసీకి పెట్టిన అర్జీలో పేర్కొన్నారు. అనుమతి లభించి, భవనం నిర్మిస్తే గ్రేటర్‌లో ఇదే అత్యంత ఎత్తయినది కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని