logo

చేసేది.. చేతికొచ్చేదానికే జై!

కొలువుల విషయంలో కొత్తతరం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రస్తుత విద్యాభ్యాసం కోరుకున్న కెరీర్‌కు సిద్ధం చేస్తుందా? వేతనాలు, హోదా, సామాజిక ప్రభావంపై వారేమనుకుంటున్నారు?

Published : 23 May 2022 02:32 IST

కొలువులు, కెరీర్‌పై బ్రెయిన్లీ సంస్థ సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: కొలువుల విషయంలో కొత్తతరం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రస్తుత విద్యాభ్యాసం కోరుకున్న కెరీర్‌కు సిద్ధం చేస్తుందా? వేతనాలు, హోదా, సామాజిక ప్రభావంపై వారేమనుకుంటున్నారు? బ్రెయిన్లీ సంస్థ సర్వే చేయగా వేతనంతో పాటు హోదా ముఖ్యమని మన కుర్రకారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. పర్యావరణహితంగా నడుచుకుంటూ వేతనం తక్కువ ఇచ్చే సంస్థలో కంటే భారీగా వేతనమిచ్చే వాణిజ్య దృక్పథంతో నడిచే సంస్థకే తమ ప్రాధాన్యమని 64 శాతం మంది అంటున్నారు. హైదరాబాద్‌తో సహా దేశంలోని వేర్వేరు నగరాల్లో విద్యార్థుల అభిప్రాయాలను ఆన్‌లైన్‌ ద్వారా సేకరించారు.

కెరీర్‌ ప్రధానం.. ఇప్పటి పిల్లలు కెరీర్‌పై స్పష్టమైన అంచనాలతో ఉంటున్నారు. తల్లిదండ్రులు పాఠశాల దశలోనే కెరీర్‌కు కోసం అవసరమైన పునాదులు వేస్తున్నారు. ఈ కోణంలోనే తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. 77.8%విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టిపెట్టడం ముఖ్యమంటున్నారు.

నలుగురికీ చెప్పుకోగలిగేలా..

చేస్తున్న పనిని గర్వంగా చెప్పుకోవడమే కాదు అందుకు తగ్గ వేతనం ఉండాలంటున్నారు.

చదువుకొనే రోజుల్లో ఎన్ని కలలున్నా.. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అత్యధిక మంది విద్యార్థులు కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు నిర్ణయించుకుంటూ తగిన కొలువుల్లో చేరిపోతున్నారు.

* కుటుంబానికి ఆర్థిక చేదోడు అందించే వారు 56.1%

* భవిష్యత్తుకు ఆర్జించేవారు 49.6%

* 63% మంది కోరుకున్న కెరీర్‌కు ఇప్పుడున్న విద్యావిధానం సిద్ధం చేస్తుందని విశ్వసిస్తున్నారు.

* అధిక వేతనాలపై మొగ్గు.. 52.8%

* వేతనం కంటే పదవి ముఖ్యం.. 35.2%

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని