logo

సామాజిక చైతన్య వేదికలు గ్రంథాలయాలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

గ్రంథాలయాలు సామాజిక చైతన్య వేదికలని, వాటిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 23 May 2022 02:32 IST

గ్రంథాలయాలకు పుస్తకాలు అందజేస్తున్న కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, చిత్రంలో

లక్ష్మణ్‌రావు, గౌతమ్‌రావు, జి.లక్ష్మణ్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: గ్రంథాలయాలు సామాజిక చైతన్య వేదికలని, వాటిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణగూడ కేశవ స్మారక విద్యాసంస్థల సభామందిరంలో తెలంగాణ గ్రంథాలయ సంఘం (టీఎస్‌ఎల్‌ఏ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత గ్రంథాలయాలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ప్రొ.లక్ష్మణ్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గ్రంథాలయ ఉద్యమకారుడు రాజారామ్మోహన్‌రాయ్‌ జయంతి రోజున పుస్తకాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖలో జాతీయ గ్రంథాలయ మిషన్‌ కార్యక్రమం ఉందని, దీని ద్వారా రాష్ట్ర, సెంట్రల్‌, జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌రావు, భాజపా నేత శ్యాంసుందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని