logo

రెండున్నర నెలల్లోనే సెమిస్టర్‌ ముగింపు

పీజీ చివరి ఏడాది సెమిస్టర్‌ ప్రణాళికను ఉస్మానియా విశ్వవిద్యాలయం సిద్ధంచేసింది. ఈనెల 26నుంచి వర్సిటీ పరిధిలోని ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, లైబ్రరీసైన్స్‌, ఎంసీజే, ఎంపీఈడీ కోర్సులకు సంబంధించి

Published : 25 May 2022 04:32 IST

ఓయూలో సమయసారిణి విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: పీజీ చివరి ఏడాది సెమిస్టర్‌ ప్రణాళికను ఉస్మానియా విశ్వవిద్యాలయం సిద్ధంచేసింది. ఈనెల 26నుంచి వర్సిటీ పరిధిలోని ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, లైబ్రరీసైన్స్‌, ఎంసీజే, ఎంపీఈడీ కోర్సులకు సంబంధించి రెండు, నాలుగు సెమిస్టర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. జులై 12, 13 తేదీల్లో మొదటి ఇంటర్నల్స్‌ జరుగుతాయి. ఆగస్టు 5, 6 తేదీల్లో రెండో విడత ఇంటర్నల్స్‌ ఉంటాయి. ఆగస్టు 12తో తరగతి గది బోధన ముగుస్తుంది. అదే నెల 22 నుంచి చివరి సెమిస్టర్‌ పరీక్షలు జరుగనున్నాయి. సెమిస్టర్‌ రెండున్నర నెలల్లోనే పూర్తి కానుంది. ప్రతిరోజూ రెండు గంటలు అదనపు తరగతులు బోధించాలి. రెండో శనివారం సైతం తరగతులు నిర్వహించాలనడంపై ఓయూ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు నాటికి సెమిస్టర్‌ పూర్తి చేయడంతో విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు వెళ్లేందుకు వీలు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని