logo

బిర్యానీలో బల్లి

ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బావర్చి హోటల్‌ నుంచి తెప్పించిన బిర్యానీలో బల్లి ఉండడంతో ఉలిక్కిపడ్డారు. శుక్రవారం రాంనగర్‌ కార్పొరేటర్‌ రవిచారి, తన సోదరుడు శ్రీనివాస్‌చారితో కలిసి బావర్చిలో ఒక బిర్యాని, ఒక తందూరి చికెన్‌ పార్సిల్‌ తెప్పించుకుని....

Published : 28 May 2022 07:16 IST

 

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బావర్చి హోటల్‌ నుంచి తెప్పించిన బిర్యానీలో బల్లి ఉండడంతో ఉలిక్కిపడ్డారు. శుక్రవారం రాంనగర్‌ కార్పొరేటర్‌ రవిచారి, తన సోదరుడు శ్రీనివాస్‌చారితో కలిసి బావర్చిలో ఒక బిర్యాని, ఒక తందూరి చికెన్‌ పార్సిల్‌ తెప్పించుకుని కార్యాలయంలో తింటుండగా అందులో బల్లి కనిపించిందని అతను తెలిపారు. దీనిపై చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న భాజపా నేతలు హోటల్‌ ముందు రెండు గంటలపాటు ఆందోళన చేశారు. శ్రీనివాస్‌చారికి వాంతులు, విరేచనాలు కావడంతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించామని వివరించారు. విషయం తెలుసుకున్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు డా.స్వాతి, డా.వేనక, డా.శిరాజ్‌ హోటల్‌ వంటశాలలో ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. శాంపిల్స్‌ సేకరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హోటల్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, సమ్మరీ ట్రయల్‌, హైజెనిక్‌ నిర్వహణ లోపంపై రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నమూనాలను పరీక్ష నిమిత్తం నాచారంలోని ఫుడ్‌ కంట్రోల్‌ ల్యాబ్‌కు పంపించామన్నారు. కార్పొరేటర్‌ రవిచారి మాట్లాడుతూ హోటల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హోటల్‌ యజమాని సల్మాన్‌ మన్సూరి మాట్లాడుతూ బిర్యానీలో బల్లి పడే అవకాశమే లేదన్నారు. అక్కసుతో చేసిన పనేనని ఆరోపించారు.


నమూనాలు సేకరిస్తున్న అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని