logo

జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి

స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌ సావర్కర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వీర్‌ సావర్కర్‌ జయంతిని పురస్కరించుకుని భాజపా

Published : 29 May 2022 02:04 IST

నివాళులర్పిస్తున్న గీతామూర్తి, భాజపా నేతలు

కాచిగూడ, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌ సావర్కర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వీర్‌ సావర్కర్‌ జయంతిని పురస్కరించుకుని భాజపా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో శనివారం కాచిగూడ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఆయన దేశభక్తి, జీవిత చరిత్ర  స్ఫూర్తిదాయకమన్నారు. భాజపా గోల్కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, అధికార ప్రతినిధులు శశికాంత్‌ కులకర్ణి, గిరిధర్‌, కార్వాన్‌ కన్వీనర్‌ లక్ష్మీకాంత్‌యాదవ్‌, గోషామహల్‌ అధ్యక్షుడు స్వరూప్‌వ్యాస్‌, కన్వీనర్‌ అనంత్‌, చార్మినార్‌ నేతలు రాజేందర్‌శర్మ, ఆదిత్య పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని