logo

బీసీలకు రాజ్యాధికార సాధనే లక్ష్యం

బీసీలకు చట్టసభలో వాటా, చేనేతపై సున్నా శాతం జీఎస్టీ కోసం సర్వశక్తులొడ్డి పోరాటం చేస్తానని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు.

Published : 30 Jun 2022 03:32 IST


కృష్ణయ్యకు వినతిపత్రం సమర్పిస్తున్న కందగట్ల స్వామి, చిత్రంలో
వి.దుష్యంతల, మంద జగన్నాథం, సత్యం, వెంకన్న, కృష్ణ

నారాయణగూడ, న్యూస్‌టుడే: బీసీలకు చట్టసభలో వాటా, చేనేతపై సున్నా శాతం జీఎస్టీ కోసం సర్వశక్తులొడ్డి పోరాటం చేస్తానని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అభినందన సత్కార సభ బుధవారం నారాయణగూడలోని పద్మశాలి భవనంలో నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం సారథ్యంలో జరిగిన సభలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నేత వెంకన్న పలు డిమాండ్లతో వినతిపత్రాన్ని ఆర్‌.కృష్ణయ్యకు అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, పద్మశాలి సంఘం నేతలు మంద జగన్నాథం, వనం దుశ్యంతల, గుంటక రూప, జిల్లాల నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని