logo

యువజన కాంగ్రెస్‌ నాయకుల ముందస్తు అరెస్టు, విడుదల

అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ నగరంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కమిటీ పిలుపుతో ముందస్తుగా పలువురు నాయకులను నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నల్లకుంటలో నివాసముంటున్న యువజన కాంగ్రెస్‌ హైదరాబాద్‌

Published : 02 Jul 2022 01:33 IST

నల్లకుంట, న్యూస్‌టుడే: అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ నగరంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కమిటీ పిలుపుతో ముందస్తుగా పలువురు నాయకులను నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నల్లకుంటలో నివాసముంటున్న యువజన కాంగ్రెస్‌ హైదరాబాద్‌ నగర అధ్యక్షుడు మోత రోహిత్‌తో పాటు స్టేషన్‌ పరిధిలోని మరో ఎనిమిది మంది నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. భాజపా కేంద్ర నాయకత్వం నగరానికి చేరుకుంటున్న సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరుగకుండా 9 మంది యువజన కాంగ్రెస్‌ నాయకులను ముందస్తు అరెస్టు చేసినట్లు సీఐ మొగిలిచర్ల రవి తెలిపారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు చెప్పారు. స్టేషన్‌ వద్ద మోత రోహిత్‌ మాట్లాడుతూ అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అరెస్టు అయిన వారిలో సాయిబాబా, సంగపాక వెంకట్‌, ఉదయ్‌, భాస్కర్‌, పవన్‌యాదవ్‌, శివ, హరి, నాని ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని