logo

ప్రచార యుద్ధం

 ప్రధాన పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలుఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు-హైదరాబాద్‌: రాజధాని నగరం శనివారం ప్రధాన రాజకీయ పక్షాల బలప్రదర్శనకు వేదికగా మారింది. ఈ ఒక్క రోజు తమదే పైచేయిగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రధాన పక్షాల

Published : 03 Jul 2022 03:26 IST

రాజధాని వేదికగా పోటాపోటీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు

 ప్రధాన పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలుఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు-హైదరాబాద్‌: రాజధాని నగరం శనివారం ప్రధాన రాజకీయ పక్షాల బలప్రదర్శనకు వేదికగా మారింది. ఈ ఒక్క రోజు తమదే పైచేయిగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రధాన పక్షాల నేతల రకరకాల ప్రయత్నాలు చేశారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, భాజపా, కాంగ్రెస్‌ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పోస్టర్ల యుద్ధ శనివారం కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు వరకు దారి తీసింది.
అగ్రనేతలు ప్రయాణించే దారుల్లో..
నగరంలో రెండు రోజులపాటు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాన నరేంద్ర మోదీతో సహా ఆ పార్టీ అగ్రనేతలు తరలి వచ్చారు. వారు ప్రయాణించే దారుల్లో పోస్టర్లను పెద్దఎత్తున ఏర్పాటు చేయించే విషయంలో కాషాయ నాయకులు దృష్టిపెట్టారు. మెట్రో పిల్లర్లు అన్నింటికి ముఖ్యమంత్రి పోస్టర్లను తెరాస ఏర్పాటు చేసింది. దీంతో శనివారం భాజపా కార్యకర్తలు మెట్రో పిల్లర్లకు ఉన్న ముఖ్యమంత్రి పోస్టర్లపై ప్రధాని మోదీ పోస్టర్లను అంటించారు. ఈ క్రమంలో ఒకటి రెండు చోట్ల తెరాస, భాజపా కార్యకర్తల మధ్య తగదాలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో తెరాస ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా రాజధానికి రావడంతో ఈ కార్యక్రమాన్ని యుక్తిగా ఉపయోగించుకుంది. బేగంపేట నుంచి జలవిహార్‌ వరకు వేలాది మంది ర్యాలీ నిర్వహించింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ కూడా శనివారం వార్తల్లో ఉండటానికి ప్రయత్నించింది. నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర రెండు రోజుల కిందట తెరాస జెండాలు కట్టారు. శుక్రవారం వీటిని కాంగ్రెస్‌ కార్యకర్తలు తొలగించారు. మళ్లీ తెరాస జెండాలు కట్టడంతో శనివారం మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ అక్కడే ధర్నా చేయడంతో పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి స్టేషన్‌కు తరలించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అక్కడికి వచ్చిన నిరసన తెలిపారు.

ఆందోళన తీరిది..
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘మనీహేస్ట్‌’ క్యారెక్టర్‌ను పోలిన వేషధారణతో ఇద్దరు వ్యక్తులు నగర వ్యాప్తంగా హల్‌చల్‌ చేశారు. ప్రధాని మోదీకు వ్యతిరేకంగా రాసిన ఫ్లకార్డులను ప్రదర్శించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. ‘ఉయ్‌ ఓన్లీ రాబ్‌ బ్యాంక్‌, యూ రాబ్‌ ది హోల్‌ నేషన్‌’ ‘బైబై మోదీ’ అంటూ మనీహేస్ట్‌ వేషధారణతో ఎల్బీనగర్‌, వనస్థలిపురం, కాచిగూడ రైల్వేస్టేషన్‌, బీహెచ్‌ఈఎల్‌, తదితర ప్రాంతాల్లోని బ్యాంకులు, రైల్వేస్టేషన్‌, ఎల్‌ఐసీ, పెట్రోల్‌ బంకుల వద్ద ప్రదర్శనలు చేశారు. ‘మోదీ, కేసీఆర్‌ ఇద్దరు వద్దు - మీ పాలన వద్దు- భవిష్యత్తుకు కాంగ్రెసే ముద్దు’ అంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లు నగరంలో పలుచోట్ల కనిపించాయి. కొన్నిచోట్ల ప్రత్యర్థి పార్టీల ఫ్లెక్సీలు, కటౌట్‌లను తొలగించి హల్‌చల్‌ చేశారు. రాజకీయ పార్టీల గొడవతో ప్రముఖుల కటౌట్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని