logo

ప్రతి రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

తెలంగాణలోని ప్రతి రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Published : 06 Jul 2022 02:11 IST


స్టాళ్ల వివరాలు తెలుసుకుంటున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. సందీప్‌ కుమార్‌ సుల్తానియా

మాదాపూర్‌, న్యూస్‌టుడే: తెలంగాణలోని ప్రతి రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కొండపోచమ్మసాగర్‌, కాళేశ్వరం, కోదండాపూర్‌, కరివెన, బస్వాపురం రిజర్వాయర్లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఫెయిర్‌ను మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య రెట్టింపు అయ్యిందన్నారు. ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఫెయిర్‌ నిర్వాహకులు సంజీవ్‌ అగర్వాల్‌, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోహర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని