logo

మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటుకు డిమాండ్‌

మున్నూరుకాపుల సమగ్రాభివృద్ధికి రూ.100 కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మున్నూరుకాపు మంత్రులు, ఎంపీలు,

Published : 07 Jul 2022 02:06 IST

మాట్లాడుతున్న వెంకటేశ్వర్‌రావు. చిత్రంలో చంద్రశేఖర్‌, లక్ష్మణ్‌, రాధాకృష్ణ, సత్యనారాయణ

కాచిగూడ, న్యూస్‌టుడే: మున్నూరుకాపుల సమగ్రాభివృద్ధికి రూ.100 కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మున్నూరుకాపు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమాన్ని నెల 9న నగరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం కాచిగూడలోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మగౌరవ భవనానికి 5 ఎకరాలు, రూ.5 కోట్లు కాకుండా 10 ఎకరాలు, రూ.20 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతినిధులు గడ్డి చంద్రశేఖర్‌, గోపాల రాధాకృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని