logo

దీర్ఘకాలిక నొప్పులపై కార్యశాల

దీర్ఘకాలిక, తీవ్రమైన నొప్పికి చికిత్స చేయడంలో వస్తున్న ఆధునిక పద్ధతులపై కిమ్స్‌ ఆసుపత్రిలో శనివారం కార్యశాల ప్రారంభమైంది. కిమ్స్‌ ఆసుపత్రి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌పెయిన్‌ మెడిసిన్‌ అండ్‌.....

Published : 07 Aug 2022 02:16 IST


జ్యోతి వెలిగిస్తున్న డాక్టర్‌ నరేష్‌కుమార్‌రెడ్డి, డాక్టర్‌ భారతి, డాక్టర్‌ నాగలక్ష్మి

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: దీర్ఘకాలిక, తీవ్రమైన నొప్పికి చికిత్స చేయడంలో వస్తున్న ఆధునిక పద్ధతులపై కిమ్స్‌ ఆసుపత్రిలో శనివారం కార్యశాల ప్రారంభమైంది. కిమ్స్‌ ఆసుపత్రి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌పెయిన్‌ మెడిసిన్‌ అండ్‌ ఎనస్థీషియాలజీ ఆధ్వర్యంలో అనస్థీషియాలజిస్టులు, పెయిన్‌ ఫిజిషియన్లకు రెండు రోజుల వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. ఎనస్థీషియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ నరేష్‌ కుమార్‌రెడ్డి, కన్సల్టెంట్‌ సీనియర్‌ ఎనస్థీషియాలజిస్టు డాక్టర్‌ భారతిల నేతృత్వంలో కన్సల్టెంట్‌ పెయిన్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ నాగలక్ష్మి పట్నలు నొప్పి నివారణకు అందుబాటులో ఉన్న చికిత్స విధానాలపై అవగాహన కల్పించారు. వీరు మాట్లాడుతూ నరాల్లోని అడ్డంకులను తొలగించడానికి ఆల్ట్రాసౌండ్‌, ప్లూరోస్కొపీల వాడకంపై దృష్టి పెట్టామని తెలిపారు. డాక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ.. సాధారణ చికిత్స విఫలమైనప్పుడు శస్త్రచికిత్స చేయించుకోవడం ఇష్టం లేనప్పుడు అవి ఉపయోగపడుతాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని