logo

అక్కడ పారబోత.. ఇక్కడ టమాటా ధరల మోత!

టమాటా ధరలు  నెల కిందటి వరకు కిలో రూ.100కు చేరువగా కొనసాగాయి. ఇప్పుడు  రైతుబజారులోనే కిలో రూ.13 కాగా.. కాలనీలకు వచ్చే తోపుడు బళ్ల వారు రూ.50కి 5 కిలోలు, 4 కిలోలు అమ్ముతున్నారు.

Updated : 11 Aug 2022 04:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: టమాటా ధరలు  నెల కిందటి వరకు కిలో రూ.100కు చేరువగా కొనసాగాయి. ఇప్పుడు  రైతుబజారులోనే కిలో రూ.13 కాగా.. కాలనీలకు వచ్చే తోపుడు బళ్ల వారు రూ.50కి 5 కిలోలు, 4 కిలోలు అమ్ముతున్నారు. నగర శివారులోని శంషాబాద్‌ మార్కెట్‌కు వెళ్తే కిలో రూ.6కే దొరుకుతోంది. వాటిని నగరానికి తీసుకురావడమే రైతులు సమస్యగా పరిగణించి.. అక్కడే పారబోసి పోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇక తిరుపతి జిల్లా మదనపల్లిలో.. అనంతపురంలో అయితే మార్కెట్లో ధర పలకలేదని అక్కడే పడేస్తే.. మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఒప్పుకోవడం లేదని.. రహదారుల పక్కన రాశులు పోసి వదిలేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని