logo

సమస్య పరిష్కారమయ్యేదాకా బాధితురాలిని ఇబ్బందిపెట్టొద్దు

సైబర్‌క్రైమ్‌ కేసులో బాధితురాలిని ఇబ్బందిపెట్టొద్దంటూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఐసీఐసీఐ బ్యాంకును ఆదేశించింది. మియాపూర్‌కు చెందిన జయశ్రీ బ్యాంకు ఖాతాకు ఈ-మెయిల్‌ అప్‌డేట్‌ విషయంలో

Published : 12 Aug 2022 03:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌క్రైమ్‌ కేసులో బాధితురాలిని ఇబ్బందిపెట్టొద్దంటూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఐసీఐసీఐ బ్యాంకును ఆదేశించింది. మియాపూర్‌కు చెందిన జయశ్రీ బ్యాంకు ఖాతాకు ఈ-మెయిల్‌ అప్‌డేట్‌ విషయంలో సైబర్‌ మోసగాళ్ల వలలో పడి డబ్బు పోగొట్టుకున్నారు.ఆ డబ్బు తిరిగి ఇప్పించాలంటూ ఐసీఐసీఐ బ్యాంకుపై కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదీ తన బ్యాంకు ఖాతాలో ఈ-మెయిల్‌ వివరాలు అప్‌డేట్‌ కోసం కస్టమర్‌ కేర్‌ నంబర్‌ వెతికి ఫోన్‌చేశారు. అవతలి నుంచి ఓ వ్యక్తి ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలు నమోదు చేస్తే సరిపోతుందని సూచించాడు. ఫిర్యాదీ అలాగే చేశారు. కొద్దిసేపటికే ఆమె ఖాతాలోని ఎఫ్‌డీ, ఆర్‌డీ డబ్బులు మాయమయ్యాయి. వెంటనే బ్యాంకు శాఖను సంప్రదించగా.. ఖాతాను బ్లాక్‌ చేయాలని సిబ్బంది సూచించారు. శాలరీ అకౌంట్‌ కావడంతో మరో అకౌంట్‌ తెరిచి బాధితురాలు ఒక నెల జీతాన్ని విత్‌డ్రా చేశారు. అనంతరం బ్యాంకు సిబ్బంది రెండో ఖాతాను బ్లాక్‌ చేశారు. పాతఖాతాలో రుణంగా తీసుకున్న డబ్బు చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది ఫోన్లు రావడంతో బాధితురాలు కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్‌ బాధితురాలు కోల్పోయిన రూ.10,90,261కు సంబంధించి బ్యాంకు నుంచి ఎలాంటి సందేశాలు, ఫోన్లు చేయొద్దంటూ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని