logo

టీఎస్‌ఐఐసీ ఆక్రమణలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు

గాజులరామారం సర్వే నంబరు 79లోని టీఎస్‌ఐఐసీ స్థలాల ఆక్రమణలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారు. మండల రెవెన్యూ, టీఎస్‌ఐఐసీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో స్థలాన్ని కబ్జాదారులు కబళించేస్తున్నారు.

Published : 25 Sep 2022 03:47 IST

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: గాజులరామారం సర్వే నంబరు 79లోని టీఎస్‌ఐఐసీ స్థలాల ఆక్రమణలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారు. మండల రెవెన్యూ, టీఎస్‌ఐఐసీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో స్థలాన్ని కబ్జాదారులు కబళించేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న రాళ్ల గుట్టలపై గద్దలు...రూ. 50కోట్ల స్థలంలో గదులు శీర్షికతో ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి సీఎస్‌ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు ఈనెల 22న రెవెన్యూ అధికారులు అక్కడ వెలిసిన కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. అయితే టీఎస్‌ఐఐసీకి కేటాయించిన స్థలాలు ఎలా కబ్జాకు గురవుతున్నాయని అధికారులను ప్రశ్నించడంతోపాటు 15 రోజుల్లో పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో మేడ్చల్‌ జిల్లా భూపరిరక్షణ విభాగం డిప్యూటీ కలెక్టర్‌ చంద్రవతి, మేడ్చల్‌ జిల్లా ఆర్డీఓ మల్లయ్య, టీఎస్‌ఐఐసీ జోనల్‌ మేనేజరు మాధవి ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయా విభాగాల అధికారులు సర్వేయర్‌తో కలిసి 79 సర్వే నంబరులోని స్థలాలను పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని