logo

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ధర్నాచౌక్‌లో ఉపాధ్యాయుల ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన

Published : 28 Sep 2022 02:38 IST

ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

కవాడిగూడ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ధర్నాచౌక్‌లో ఉపాధ్యాయుల ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఖాళీలను పెంచుతూ ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసే చర్యలను సహించమని హెచ్చరించారు. ఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య, టీఆర్‌టీఎఫ్‌ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్‌ మద్దతు ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు సునీల్‌, కార్తిక్‌, లింగస్వామి, కృష్ణ, యూసుఫ్‌, విష్ణు, వెంకన్న, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని