logo

లంచం తీసుకుంటూ దొరికిన ఏఈ

విద్యుత్తు శాఖ ఎర్రగడ్డ సెక్షన్‌ ఏఈ రాజు  ఏసీబీ అధికారులకు దొరికాడు.  నేతాజీనగర్‌ నగర్‌కు చెందిన వినియోగదారుడు  ఇంటి మీటర్‌ పనిచేయడం లేదని గత నెలలో ఫిర్యాదు చేశారు. పరిశీలించిన ఏఈ ట్యాంపరింగ్‌ జరిగిందని, సమస్య లేకుండా ఉండాలంటే రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated : 02 Oct 2022 04:18 IST

వెంగళ్‌రావునగర్‌: విద్యుత్తు శాఖ ఎర్రగడ్డ సెక్షన్‌ ఏఈ రాజు  ఏసీబీ అధికారులకు దొరికాడు. నేతాజీనగర్‌ నగర్‌కు చెందిన వినియోగదారుడు  ఇంటి మీటర్‌ పనిచేయడం లేదని గత నెలలో ఫిర్యాదు చేశారు. పరిశీలించిన ఏఈ ట్యాంపరింగ్‌ జరిగిందని, సమస్య లేకుండా ఉండాలంటే రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఏఈ ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వాలని అడగగా, నా వద్ద రూ.30 వేలు మాత్రమే ఉన్నాయని వినియోదారుడు చెప్పడంతో బాలానగర్‌ వై-జంక్షన్‌ వద్దకు రావాలని ఏఈ సూచించాడు. వినియోగదారుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చాడు. రూ.30 వేలు తీసి ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈని పట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని