logo

ప్లాస్టిక్‌ విక్రయిస్తే జరిమానా..

పట్టణంలో 75 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ చేతి సంచులు, ప్లాస్టిక్‌ వస్తువుల విక్రయాలపై తనిఖీలు జరిగాయి.

Published : 24 Nov 2022 01:50 IST

దుకాణదారుని చెంత కమిషనర్‌ శరత్‌చంద్ర

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: పట్టణంలో 75 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ చేతి సంచులు, ప్లాస్టిక్‌ వస్తువుల విక్రయాలపై తనిఖీలు జరిగాయి. బుధవారం పురపాలక సంఘం కమిషనర్‌ శరత్‌చంద్ర, సిబ్బంది కిరాణ, హోల్‌సెల్‌ దుకాణాలను తనిఖీ చేశారు. ప్లాస్టిక్‌ చేతి సంచులను విక్రయిస్తున్న వారిని గుర్తించి రూ.7 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని పేర్కొన్నారు. ఇక నుంచి పట్టణంలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్‌ మెయినొద్దీన్‌, పర్యావరణ ఇంజినీర్‌ శ్రీనివాస్‌, యేసుదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని