logo

వచ్చే నెలాఖరుకు కొత్తగూడ పైవంతెన పూర్తి

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గ్రేటర్‌ మేయర్‌ విజయలక్ష్మి ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

Updated : 27 Nov 2022 04:43 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గ్రేటర్‌ మేయర్‌ విజయలక్ష్మి ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయా పనులపై అధికారులతో సమీక్షించారు. నగరంలో సిగ్నల్‌ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.8వేల కోట్లతో ఎస్సార్డీపీ ద్వారా 41 పనులను చేపట్టగా, అందులో 30 పూర్తయినట్లు అధికారులు మేయర్‌ దృష్టికి తెచ్చారు. కొత్తగూడ పైవంతెన డిసెంబరు చివరివారానికి, ఎల్బీనగర్‌ కుడివైపు వంతెన 90శాతం పనులు పూర్తయినట్లు చెప్పారు. వీటిని వచ్చే ఏడాది ప్రారంభించేలా చూడాలని మేయర్‌ ఆదేశించారు. ఇతర శాఖలకు సంబంధించిన 6 పనుల్లో మూడు పూర్తయ్యాయని, మిగతావి నిర్దేశిత గడువు కంటే ముందే పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. సీఈ (ప్రాజెక్ట్స్‌) దేవానంద్‌, ఎస్‌.సి. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని