logo

ఆదర్శమన్నారు..ఆచరణ మరిచారు

నగరం నలువైపులా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తాం.. సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గిస్తాం.

Published : 30 Nov 2022 01:31 IST

అభివృద్ధికి ఆమడదూరంలో నాగులపల్లి రైల్వేస్టేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరం నలువైపులా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తాం.. సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గిస్తాం.. ఔటర్‌ రింగురోడ్డుకు చేరువగా ఉన్న నాగులపల్లి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తే ముంబయి నుంచి వచ్చిన ప్రయాణికులు అక్కడే దిగిపోయి ఔటర్‌ రింగురోడ్డులో వెంటనే ఇంటికి చేరుకుంటారని దమ రైల్వే అధికారులు ఎంతో ఘనంగా ప్రకటించారు. ఇక్కడే రాష్ట్రప్రభుత్వం లాజిస్టిక్‌ హబ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఐటీ కారిడార్‌కు అతి చేరువలో ఉండే ఈ రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి వస్తే వేలాది మంది ప్రయాణికులకు ఎంతో అనువుగా ఉంటుంది.

ఆరేళ్ల క్రితం ప్రకటన.. ఆదర్శ రైల్వేస్టేషన్‌గా నాగులపల్లిని అభివృద్ధి చేయాలని దక్షిణమధ్య రైల్వే ఆరేళ్లక్రితం ప్రకటించింది. ఈ స్టేషన్‌ మీదుగా తిరుపతి వెళ్లే రైళ్లతోపాటు ముంబయి, నాగ్‌పుర్‌, పుణే, రాయలసీమ, తిరుపతి వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతోపాటు ప్యాసింజర్‌ రైళ్లు ఈ మార్గంలో రోజుకు 17కుపైగా పరుగులు పెడుతుంటాయి. 300 ఎకరాల స్థలం రాష్ట్రం కేటాయిస్తే చర్లపల్లి మాదిరే ఒక శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసేలా చూస్తామని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నాగులపల్లి రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో ఒక్క ఎకరా భూమి కూడా ద.మ. రైల్వేకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే అభివృద్ధి జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు