logo

తెరాసను బీఆర్‌ఎస్‌గా ఎందుకు మార్చారు?

తెలంగాణ ప్రజల కోసం పెట్టిన తెరాసను బీఆర్‌ఎస్‌గా ఎందుకు మార్చారని వైతెపా రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రామచంద్రారావు ప్రశ్నించారు.

Published : 01 Dec 2022 02:37 IST

కేసీఆర్‌ అవినీతి, అక్రమాలపై దేశవ్యాప్త ప్రచారం

వైతెపా రాష్ట్ర నేత గట్టు రామచంద్రారావు

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రజల కోసం పెట్టిన తెరాసను బీఆర్‌ఎస్‌గా ఎందుకు మార్చారని వైతెపా రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రామచంద్రారావు ప్రశ్నించారు. బంజారాహిల్స్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యమకారుల పేరు చెప్పుకొని తెరాస నాయకులు బతుకుతున్నారన్నారు. తెరాస తమను అడ్డుకున్నట్లు ఆ పార్టీ పెట్టిన ప్రారంభంలో ఇతరులు అడ్డుకుంటే ఇవ్వాళ మీరు తిరిగేవారా.. అని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితే అప్పట్లో ఉంటే కేవలం కాంగ్రెస్‌ ఉండేదన్నారు. ‘షర్మిల తిరిగి పాదయాత్ర చేస్తే ఏం జరిగినా తమకు సంబంధం లేదని తెరాస నాయకులంటున్నారని, అంటే హెచ్చరిస్తున్నారా.. కాపాడలేని వారికి అధికారమెందుకు..’ అని ప్రశ్నించారు. షర్మిల పాదయాత్రకు న్యాయస్థానం అనుమతిచ్చింది.. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోరా అని అన్నారు. కేసీఆర్‌ అవినీతి, ఆక్రమాలపై దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని