logo

కేటాయింపునకు 2,445 ‘డబుల్‌’ ఇళ్లు సిద్ధం

నగర శివారులో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపునకు రంగం సిద్ధమవుతోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ నిర్ణయించారు.

Updated : 02 Dec 2022 05:48 IST

కలెక్టర్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగర శివారులో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపునకు రంగం సిద్ధమవుతోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ నిర్ణయించారు. జిల్లాలో 5380 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా.. తొలిదశలో 2445 గృహాలు నిర్మించారు. లబ్ధిదారుల ఎంపికకు  వచ్చే నెల 11వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. తొలుత ఈ నెల 7వ తేదీ నుంచి ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మొదటి గ్రామ/నగర సభ ఈ నెల 7న జరగనుంది. అక్కడే పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 9 నుంచి 21వ తేదీ మధ్య ఇంటింటి సర్వే చేపడతారు.  22వ తేదీన అర్హుల జాబితా తయారు చేస్తారు. రెండో గ్రామ సభ 28న నిర్వహిస్తారు. 29న లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు.  31వ తేదీన జాబితాను కలెక్టర్‌కు సమర్పిస్తారు.  వచ్చే నెల 11న లాటరీ తీసి ఎంపిక చేసి కేటాయిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని