logo

భూ కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు పెట్టండి

మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలంలోని భూ ఆక్రమణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

Published : 04 Dec 2022 02:02 IST

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌కు సీఎస్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలంలోని భూ ఆక్రమణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్‌ను ఆదేశించారు. కుత్బుల్లాపూర్‌ మండలంలోని గాజులరామారం, సూరారం తదితర ప్రాంతాల్లో భూ ఆక్రమణలు, దాని వెనుక ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకుల హస్తంపై ఈ నెల 2న ‘ఈనాడు’లో ‘ప్లాట్లు చేసి.. రూ.కోట్లు మేసి’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన సీఎస్‌.. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆక్రమణలను తొలగించి హద్దులు నిర్ణయించాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో వెలసిన ఆక్రమణలపై చర్యలకు జిల్లా రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని