logo

నాలుగుసార్లు ఓటరు నమోదుకు అవకాశం: కలెక్టర్‌

ఎన్నికల సంఘం ఏడాదికి నాలుగుసార్లు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని జిల్లా పాలనాధికారిణి నిఖిల తెలిపారు.

Published : 26 Jan 2023 00:49 IST

ప్రతిజ్ఞ చేస్తున్న నిఖిల, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, అధికారులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్నికల సంఘం ఏడాదికి నాలుగుసార్లు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని జిల్లా పాలనాధికారిణి నిఖిల తెలిపారు. బుధవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయంలో విద్యార్థులతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 17 సంవత్సరాలు నిండిన వారు ముందస్తుగా ఫారం-6 ద్వారా ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన పిదప ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఎన్నికల్లో 30 శాతం ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవటం లేదన్నారు. ఈసారి ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రూపొందించిన పాటను విని అందరూ ప్రతిజ్ఞ చేశారు.

* అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్న 95 సంవత్సరాల వృద్ధుడు భూమయ్యను సన్మానించారు. జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ, స్వీప్‌ నోడల్‌ అధికారి కోటాజీ, డీఆర్‌డీఓ కృష్ణన్‌, జిల్లా అధికారులు హన్మంత్‌రావు, శంకర్‌నాయక్‌, సుధారాణి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.


ఆన్‌లైన్‌లో దళితబంధు దరఖాస్తులు స్వీకరించాలి  

దళిత బంధు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించాలని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదురుగా కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి మాట్లాడుతూ దళిత బంధుకు సంబంధించిన పెండింగ్‌ డబ్బును వెంటనే మంజూరు చేయాలని కోరారు. కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్‌, నాయకులు సుదర్శన్‌, శ్రీనునాయక్‌, సురేశ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు