logo

క్రీడారంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలి

క్రీడా రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఓయూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ బి.సునీల్‌కుమార్‌ విద్యార్థులకు సూచించారు.

Published : 02 Feb 2023 06:43 IST

విజేత జట్టుతో సునీల్‌కుమార్‌, శ్రీనివాస్‌రావు, వెంకటయ్య, దీపికారావు, రాజేశ్‌, మనోజ్‌ తదితరులు

కాచిగూడ, న్యూస్‌టుడే: క్రీడా రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఓయూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ బి.సునీల్‌కుమార్‌ విద్యార్థులకు సూచించారు. కాచిగూడ బద్రుకా కామర్స్‌ కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన ఓయూ అంతర్‌ కళాశాలల మహిళల క్యారమ్స్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది. విజేతలు సెయింట్‌ ఆన్స్‌ (మెహిదీపట్నం), భవన్స్‌ (సైనిక్‌పురి), కస్తూర్బాగాంధీ (సికింద్రాబాద్‌), బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. తెలంగాణ క్యారమ్స్‌ రిఫరీ శ్రీనివాస్‌రావు, ఐసీటీ మహిళా కార్యదర్శి డాక్టర్‌ దీపికారావు, బద్రుకా వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వెంకటయ్య, ఫిజికల్‌ డైరెక్టర్లు రాజేశ్‌, మనోజ్‌, ఎంకే నసీర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని