logo

అజరామరవాణి.. ఈ అలివేణి

కె.విశ్వనాథ్‌ ప్రాణ ప్రతిష్ఠ చేసిన ‘స్వాతికిరణం’ చిత్రంలో ‘ఆనతినీయరా హరా..., ఘర్షణ సినిమాలో ‘ఒక బృందావనం’ వంటి వంటి విభిన్న పాటలతో తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్న మధురగాయని వాణీజయరాం హఠాన్మరణంతో సంగీత ప్రపంచం మూగబోయినట్లైంది.

Published : 05 Feb 2023 04:09 IST

గాయనీ గాయకులు రామకృష్ణ, సంజయ్‌కిషోర్‌, పి.సుశీల, ఎల్‌ఆర్‌ ఈశ్వరి, వాణీజయరాం, సంధ్య, ఎస్పీ శైలజ, జమునారాణి

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: కె.విశ్వనాథ్‌ ప్రాణ ప్రతిష్ఠ చేసిన ‘స్వాతికిరణం’ చిత్రంలో ‘ఆనతినీయరా హరా..., ఘర్షణ సినిమాలో ‘ఒక బృందావనం’ వంటి వంటి విభిన్న పాటలతో తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్న మధురగాయని వాణీజయరాం హఠాన్మరణంతో సంగీత ప్రపంచం మూగబోయినట్లైంది. 1968లో నగరంలోని స్టేట్‌ బ్యాంక్‌ శాఖలో ఉద్యోగం చేసిన ఆమె తర్వాత ముంబయికి మకాం మార్చారు. అనంతరం ఇక్కడ జరిగే పలు కార్యక్రమాలకు హాజరయ్యేవారు. అలా వచ్చినప్పుడు నగరంలో వస్తున్న మార్పుల గురించి తన అభిప్రాయం పంచుకునేవారని సినీ చరిత్రకారుడు సంజయ్‌కిషోర్‌ తెలిపారు. సురభి నాటకాలను వీక్షించడానికి వచ్చినప్పుడు కళాకారులతో కొద్దిసేపు గడిపేవారు. సంగమం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పబ్లిక్‌గార్డెన్స్‌ తెలుగు లలితకళాతోరణంలోని సురభి థియేటర్‌లో ఔత్సాహిక గాయనీగాయకులకు గతంలో 15 రోజుల కార్యశాల నిర్వహించారు. ఆమె నగరంలో ఉండి పాటలు పాడటం ఎలా.. సినీ సంగీతంలో వస్తున్న మార్పులు గురించి స్వయంగా అవగాహన కల్పించారు. గాయని పి.సుశీల తన పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని రవీంద్రభారతిలో ఆమెకు ప్రదానం చేశారు. ప్రముఖ గాయకులు రామకృష్ణ, ఎల్‌.ఆర్‌.ఈశ్వరి, ఎస్పీ శైలజ, జమునారాణి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె ‘ఎన్నెన్నో జన్మలబంధం నీదీనాదీ’ వంటి గీతాల చరణాలను ఆలపించి ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని