logo

ప్రాణ రక్షణకు హెల్మెట్‌ దోహదం: డీఎస్పీ

ప్రమాదాల్లో శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరిస్తే ప్రాణాలు కాపాడతాయని తాండూరు డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌ తెలిపారు. హెల్మెట్ల ఆవశ్యకతపై గురువారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Published : 24 Mar 2023 02:44 IST

అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: ప్రమాదాల్లో శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరిస్తే ప్రాణాలు కాపాడతాయని తాండూరు డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌ తెలిపారు. హెల్మెట్ల ఆవశ్యకతపై గురువారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అందరు హెల్మెట్లు ధరించి ర్యాలీలో చేపట్టారు. ఇదే సందర్భంగా ఆయన మాట్లాడారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్‌  ధరించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు తేడా లేకుండా అందరూ నియమాన్ని పాటించాలని చెప్పారు. కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: ప్రాణ రక్షణకు హెల్మెట్లు ధరించి ప్రయాణాలు చేయాలని డీఎస్పీ కరుణాసాగర్‌ రెడ్డి అన్నారు. గురువారం బొంరాస్‌పేట స్టేషన్‌ పరిధిలోని పోలీసులకు హెల్మెట్లు అందించారు. వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకు హెల్మెట్లు సహకరిస్తాయని అన్నారు. పోలీసులు విధుల్లో భాగంగా బయటకు వెళ్లినా హెల్మెట్‌ ధరించటాన్ని మరిచిపోరాదని ఆయన అన్నారు. కార్యక్రమంలో కొడంగల్‌ సీఐ శంకర్‌, ఎస్సై శంకర్‌ తదితరులున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు