logo

ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ‘దసరా’ సందడి

శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వం వహించిన ‘దసరా’ సినిమా గురువారం విడుదలైన సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్‌ థియేటర్‌ వద్ద హీరో నాని, హీరోయిన్‌ కీర్తిసురేష్‌లు సందడి చేశారు

Published : 31 Mar 2023 02:44 IST

సుదర్శన్‌ థియేటర్‌లో కేకు కోస్తున్న హీరో నాని, హీరోయిన్‌ కీర్తిసురేష్‌

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వం వహించిన ‘దసరా’ సినిమా గురువారం విడుదలైన సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్‌ థియేటర్‌ వద్ద హీరో నాని, హీరోయిన్‌ కీర్తిసురేష్‌లు సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులతో కలిసి వారు సినిమాను తిలకించారు. అనంతరం కేకు కోసి పంచిపెట్టారు. నానిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో థియేటర్‌ వద్దకు తరలివచ్చారు. మరోవైపు, థియేటర్‌ ఆవరణలో నాని భారీ కటౌట్‌నూ ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని