logo

మెట్రో రాయితీల్లో కోత

మెట్రోరైలు ప్రయాణ ఛార్జీల్లో ఐదేళ్లుగా ఇస్తున్న రాయితీకి ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ కోత పెట్టింది. డిజిటల్‌ క్యూఆర్‌ కోడ్‌, మెట్రో స్మార్ట్‌కార్డుపై ప్రయాణ ఛార్జీల్లో ఇప్పటివరకు 10 శాతం రాయితీ ఇస్తోంది.

Published : 01 Apr 2023 03:02 IST

రద్దీ వేళల్లో 10 శాతం డిస్కౌంట్‌ ఎత్తివేత
సూపర్‌ సేవర్‌ హాలిడే కార్డు రూ.59 నుంచి 99కి పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు ప్రయాణ ఛార్జీల్లో ఐదేళ్లుగా ఇస్తున్న రాయితీకి ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ కోత పెట్టింది. డిజిటల్‌ క్యూఆర్‌ కోడ్‌, మెట్రో స్మార్ట్‌కార్డుపై ప్రయాణ ఛార్జీల్లో ఇప్పటివరకు 10 శాతం రాయితీ ఇస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి రద్దీ సమయాల్లో దీనిని తొలగిస్తున్నట్లు శనివారం తెలిపింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు స్మార్ట్‌కార్డుపై ప్రయాణించినా ఇకపై 10 శాతం రాయితీ రాదు. ఉదయం 6 నుంచి 8 గంటల లోపు, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల లోపు కార్డుతో ప్రయాణించేవారికి మాత్రం ప్రయాణ ఛార్జీలపై రాయితీ వర్తిస్తుందని తెలిపింది.

హాలిడే కార్డు ధర 67శాతం పెంపు

సెలవుల్లో అపరిమితంగా ప్రయాణించేందుకు సూపర్‌ సేవర్‌ హాలిడే కార్డును మెట్రో సంస్థ ఏడాది క్రితం ప్రవేశపెట్టింది. రూ.59తో సెలవు రోజుల్లో రోజంతా ప్రయాణించవచ్చు. గత ఏడాదిగా దీనితో 13 లక్షల మంది ప్రయాణించారు. ఈ కార్డు ధరను ఏకంగా రూ.99కి పెంచింది. ఏడాది పాటు ఇది అమల్లో ఉంటుందని.. 100 సెలవు రోజులు ఉన్నాయని ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. ప్రస్తుతం మెట్రోలో ప్రతిరోజు సగటున 4.4 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని